అనన్య
పండక్కి నాన్నమ్మ గారింటికి వెళ్తున్నాడు చారుకేశ. ఎప్పుడో స్కూల్లో ఉండగా ఇలా సెలవులకి అమ్మమ్మల ఇళ్ళకీ, నాన్నమ్మల ఇళ్ళకీ వెళ్ళేవాడు. టెన్త్ ఐన ఏడాది నుండీ ప్రతి సెలవులకీ ఏదో ఒక కోచింగ్ ఉండటంతో కుదరనేలేదు. మళ్ళీ ఇప్పుడు, పీజీలో చేరాక పది రోజులు సెలవులు వచ్చేసరికి ఎలాగైనా వెళ్లాలని తీర్మానించుకున్నాడు.
నాన్నమ్మ, తాతగారు, తాతమ్మ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అందరు మనవలతో గోరుముద్దలు తినిపిస్తోంది నాన్నమ్మ రోజూ. చిన్ననాటి రోజులన్నీ తిరిగి వచ్చినట్లుంది చారుకేశకి. కాకపోతే ఇప్పుడు తను ఇదివరకటిలా ఆడి పాడి చిందులు వేయలేడు కదా? బాబాయిల పిల్లలు ఆడుకుంటుంటే చూస్తూ సంతోషిస్తున్నాడు. కాసేపు తాతగారితో చెస్ ఆడుతూ, ఇంకాసేపు తాతమ్మతో కబుర్లు చెప్తూ, మరికాసేపు నానమ్మ వంట చేస్తుంటే రుచులు చూస్తూ, కాసేపు ఏదో పుస్తకం చదువుతూ, కాసేపు టీవీ చూస్తూ కాలాక్షేపం చేస్తున్నాడు. ఒక రోజు పిల్లల అల్లరి ఆపటానికి తాతమ్మ కథ చెప్తా రమ్మని పిలిచింది. అందరూ ఆవిడ చుట్టూ చేరారు. అక్కడే పుస్తకం చదువుతూ కూర్చున్న చారుకేశ కూడా కథ విందామని పుస్తకం మూసేశాడు.
ఆవిడ మొదలుపెట్టిన కథ చిన్నప్పుడు తను విన్నదే. "అనగనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుకి ఇద్దరు భార్యలు ఉన్నారుట. పెద్ద రాణికి ఒక్క వెంట్రుక, చిన్న రాణికి రెండు వెంట్రుకలు ఉండేవిట. అందుకని రాజుకి చిన్నరాణి అంటే ఎక్కువ ప్రేమ ఉండేదిట. చిన్నరాణి రాజుతో చెప్పి పెద్దరాణిని బైటకి గెంటేసిందిట. పెద్దరాణి బాధగా వెళ్తుంటే, ఒక సన్యాసి ఎదురొచ్చి "ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇక్కడ ఒక నది ఉంది. అందులో మూడుసార్లు మునిగితే జుట్టు వచ్చేస్తుంది" అన్నాడుట. ఆవిడ అలాగే చేసేసరికి మోకాలు వరకు పొడవైన జుట్టు వచ్చేసిందిట. ఆవిడ మళ్ళీ రాజు దగ్గరకి వెళ్ళిందిట. రాజుగారు ఇప్పుడు చిన్నరాణిని బైటకి గెంటేశాడుట. ఆవిడ కూడా నడుచుకుంటూ వెళ్తుంటే, మళ్ళీ అదే సన్యాసి కనిపించి "ఎందుకమ్మా ఏడుస్తావ్? ఈ నదిలో మూడు సార్లు మునిగితే జుట్టు వచ్చేస్తుంది" అని చెప్పాడుట. చిన్నరాణికి కూడా అలాగే జుట్టు వచ్చేసిందిట. అప్పుడు చిన్నరాణి "మూడు సార్లు మునిగితేనే ఇంత జుట్టు వచ్చింది అంటే నాలుగు సార్లు మునిగితే ఇంకెంత జుట్టు వస్తుందో" అనుకుని మళ్ళీ మునిగిందిట. అప్పుడు మొత్తం జుట్టంతా పోయిందిట. ఇదివరకు ఉన్న రెండు వెంట్రుకలు కూడా పోయాయిట. అందుకే దురాశ, అసూయ పనికిరావు." అంటూ కథ ముగించింది తాతమ్మ.
చిన్నప్పుడు ఈ కథ వింటే నవ్వొచ్చేది. తరువాత కొన్నాళ్ళకి రకరకాల సందేహాలు పుట్టుకొచ్చేవి.
"అసలు అలా ఒక్క వెంట్రుక, రెండు వెంట్రుకలు ఎవరికైనా ఉంటాయా?"
"నదిలో మునిగితే అంత జుట్టు ఎలా వచ్చేస్తుంది?"
"రాజుకి కొంచెం పిచ్చి. లేకపోతే అసలు ఒకటీ-రెండు వెంట్రుకలు ఉన్నవాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? మళ్ళీ ఎందుకు గెంటేశాడు?"
సమాధానాలు లేని ఇలాంటి ప్రశ్నలు వేసేవాడు.
కానీ ఇంకాస్త పెద్దయ్యాక ఇలాంటి కథలని 'పెద్దరికం' గా చూడటం అలవాటయ్యింది. "పిల్లలకి నీతి చెప్పటం కోసం రకరకాల కథలు అల్లేవారు పూర్వకాలం వాళ్ళు. ఇందులో మనం ఈకలు పీకక్కర్లేదు. పిల్లలు నాలుగు మంచి విషయాలు నేర్చుకుంటున్నారు కదా?" అనుకునేవాడు. కానీ విచిత్రంగా ఈసారి కోపం వచ్చింది. దగ్గర దగ్గర రక్తం ఉడికిపోయినంత పనయ్యింది. పిల్లలు అందరూ నవ్వుతుంటే తనను చూసి నవ్వుతున్నారేమో అనిపించి మొహం ఎర్రబడిపోయింది.

గత రెండేళ్లుగా నెమ్మది నెమ్మదిగా తన బుర్రంతా ఒక మైదానం ఏర్పాటు అయ్యింది మరి. ఆ కథలో రాణులకీ తనకీ పెద్ద తేడా ఏమీ లేదు ఇంక. అలా జుట్టుని పుట్టించే నదులూ లేవాయే! ఎవరు అర్థం చేసుకుంటారు తన ఇబ్బంది? అమ్మ-నాన్న అయితే "అవన్నీ పట్టించుకోకు, చదువు మీద ధ్యాస పెట్టు" అంటారు. తాతగారికి చెప్తేనేమో "నా పోలికేరా నీది" అంటూ మురిసిపోతారు. ఆయనకి నాన్నమ్మ సపోర్ట్. "మీకు యాభయ్యిల్లో వచ్చింది, నాకు ఇరవయ్యిల్లోనే వచ్చింది స్వామీ" అని చెప్తే మాత్రం ఏం ఒప్పుకుంటారు? అన్నయ్య మాత్రం ఏదో ఒక పాయింటులో ఆ 'పోలిక' తప్పించుకున్నట్లున్నాడు. నడుస్తుంటే ఎగిరెగిరి పడే హెయిర్ స్టైల్ వాడిది. తనకే గనక శాపం పెట్టే పవరుంటే ఎప్పుడో పెట్టేసేవాడు 'అన్నయ్యకి నాలుగు వెంట్రుకలే మిగులుగాక' అని. అసలు తను మంచివాడు కాబట్టి ఆ నాలుగు వెంట్రుకలైనా ఉండనిస్తాను అంటున్నాడు. మరి వాడు కొట్టే బడాయి అంతా-ఇంతానా? కాఫీ తాగుతున్నా అద్దం ముందే, చదువుకుంటున్నా అద్దం ముందే, ఫోన్ మాట్లాడుతున్నా అద్దం ముందే ఉంటాడు ఆ కేశసంపదని దువ్వెనతోనో, వేళ్ళ తోనో సరిచేసుకుంటూ. తను రోజు మొత్తంలో ఒకసారి తల దువ్వాలన్నా దువ్వెన కూడా బద్ధకిస్తుంది "ఈ తలకి కూడా నేను కావాలా" అన్నట్లు. వీటన్నిటికీ తోడు ఈమధ్య 'ఫోటోఫోబియా' ఒకటి మొదలయ్యింది. లైటున్న చోట నుంచుంటే నెత్తి మీదున్న ఖాళీ నిగనిగలాడుతూ ఎక్కడ బైటపడుతుందో అని!
నిజానికి తను చెప్పుకోదగిన అందగాడే. కానీ ఈ రెండేళ్లలో అంతా మారిపోయింది. పెళ్లి అవ్వటం, అవ్వకపోవటం మాట అటు ఉంచినా, మామూలుగా రోడ్డు మీద నడుచుకెళ్ళాలి అంటే ఆలోచిస్తున్నాడు...అందరూ తన నెత్తినే చూస్తున్నట్లు అనిపిస్తోంది. పైన ఉండాల్సినది కూడా లేకపోయినా "శిరోభారం" ఎక్కువైపోతోంది. కనీసం "చారుకేశ" అన్న పేరు పెట్టుకున్నందుకైనా ఆ మర్యాద నిలపలేదు తన జుట్టు!
ఇలా ఇక్కడే కూర్చుంటే ఇంకా చిరాకు పెరిగేటట్లు ఉంది చారుకేశకి. అలా గోదావరి వరకు వెళ్లివద్దామని పాలేరు సైకిల్ తీసుకుని బయల్దేరాడు. గోదావరి గట్టున ఒక్క అరగంట కూర్చుంటే చాలు... ఎవరికైనా ఎలాంటి చిరాకులున్నా ఇట్టే పోతాయి. తనకి చిన్నప్పటి నుండి అలవాటుగా ఉన్నదే గోదారితో ఈ స్నేహం. పిల్లగాలికి సలాం కొట్టి పక్కకు తప్పుకునే సిపాయిల్లా గోదావరి అలలు, ఆ చల్లదనానికి వేసవి పగటి వేడి నుండి మేము విముక్తి పొందామని ప్రకటిస్తున్న పక్షుల గొంతులు, నీళ్ళు ముంచుకు తీసుకుపోవటానికి వచ్చిన ఆడవాళ్ళు, ఈత నేర్చుకోవటానికి వచ్చిన పిల్లగాళ్ళు, నేర్పటానికి వచ్చిన తండ్రులు-తాతలు, ఊసులాడుకోవటానికి వచ్చిన జంటలు, ఊరికే గాలి పీల్చుకోవటానికి వచ్చిన పెద్దవాళ్ళు, ఈ చుట్టాలందరినీ పలకరించటానికి పైకి వచ్చి మళ్ళీ లోపలకి మునుగుతున్న చేపపిల్లలు... అంతా ఒక అందమైన చిత్రం...చిత్రమైన అందం.
ఎప్పట్లాగే పది నిముషాల్లో కోపం, చిరాకు పోయి, మనసు నిర్మలంగా తయారయ్యింది. లాంచీ అవతలి ఒడ్డుకి వెళ్ళటానికి బయల్దేరుతోంది. గబగబా మెట్ల మీద నుండి లేచి వెళ్లి లాంచీ ఎక్కాడు. అది ఒక సరదా ప్రయాణం, పని ఉన్నా లేకపోయినా లాంచీ లో అవతలి ఒడ్డుకి వెళ్లివస్తే ఆ ఇదే వేరు. లాంచీలో ఎక్కి చల్లగాలి పీల్చుకుంటూ ఉండగా గమనించాడు. లాంచీ చక్రం తిప్పుతున్న కుర్రాడికి ఒక కాలు, ఒక చెయ్యి లేవు. అన్నీ బాగున్న వాళ్ళకే ఇది చాలా కష్టమైన పని. అలాంటిది తను ఎలా అంత సమర్థవంతంగా తిప్పేస్తున్నాడో! అడిగితే అలవాటైపోయింది బాబుగారూ అన్నాడు హుషారుగా. ఏ పని చేయాలన్నా కాలు, చెయ్యి చాలా అవసరం కదా? అంతెందుకు? ఒక్క వేలుకి దెబ్బ తగిలితేనే మనం విలవిలలాడిపోతాము. ఈ కుర్రాణ్ణి చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. కొద్దిగా సిగ్గుగా కూడా అనిపించింది. తనకి లేనిది జుట్టు మాత్రమే. కాలూ, చేయీ కూడా లేని ఆ కుర్రాడే "అలవాటైపోయింది" అంటూ ఉత్సాహంగా గడిపేస్తున్నాడు. ఆలోచించే కొద్దీ ఏదో ఉత్సాహం పెరిగింది. లాంచీ ప్రయాణం ముగించి సైకిల్ మీద ఇంటికి బయల్దేరాడు. అసలు బట్టతల శాపం కాదు సరికదా బోలెడంత పెద్ద వరం.
బట్టతల ఉంటే నూనె కర్చు తగ్గుతుంది, షాంపూ కర్చు తగ్గుతుంది. రకరకాల టోపీలు పెట్టుకునే అవకాశం ఉంతుంది. జుట్టు చెరిగిపోయిందేమో అని కంగారు పడి అస్తమానం దువ్వక్కర్లేదు. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు చెరుగుతుందనే భయం అసలే అక్కరలేదు. జేబులో దువ్వెన మోయక్కర్లేదు. అదో అడ్డం కాదూ? అందరూ తనని తెలివైన వాడిగా చూస్తారు. పెద్దమనిషిగా గౌరవిస్తారు. సలహాలూ అవీ అడగటం మొదలు పెడతారు. బస్సుల్లో రైళ్ళలో సులభంగా సీట్ దొరుకుతుంది. తన పక్కనున్న కురాళ్ళు అల్లరి చేస్తే తనని కూడా కలిపి తిట్టటం ఇక ఉండనే ఉండదు. రేపు చదువయ్యాక ఉద్యోగం ఇంటర్వ్యూలకి వెళ్తే తన మీద పడే "మేధావి", "మెచ్యూర్డ్" అభిప్రాయాలు బాగా ఉపయోగపడచ్చు. అందరిలోనూ మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఒక మాంచి కారణం ఉంటుంది జనానికి. రేపన్న రోజున తెల్ల జుట్టు వస్తే ఉన్నట్టుండి ముసలి వాలకం రాదు. బుర్ర వెనుక నల్ల జుట్టు ఉన్నా తెల్ల జుట్టు ఉన్నా ఒకటే కదా? ఇన్ని ఉపయోగాలు ఉన్న బట్టతల మీద ఇన్నాళ్ళూ ఏహ్య భావం పెంచుకున్నానా అనుకున్నాడు చారుకేశ. కుదరదు గానీ ఒక్కసారి ఆ నున్నటి బట్టతలకి సుతారంగా ఒక ముద్దు ఇచ్చుకోవాలి అనిపించింది.
ఈ నూతనోత్సాహం తో సైకిల్ వేగం పెంచుతూ ఇంటికి చేరి రామాయణం చదువుకుంటున్న తాతయ్య బట్టతలకి ఒక చిన్ని ముద్దు పెట్టి సున్నితంగా నిమిరాడు. ఎప్పుడూ లేని ఈ సన్నివేశానికి నేవ్వేరపోయి చూశారు తాతయ్య.

No comments:
Post a Comment